టీవీ వార్తలు చూసి.. విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ చేసిన బాలుడు

ఇప్పుడున్న తరం పిల్లలు టీవీలు.. ఫోన్లు.. ఎక్కువ చూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  11 Jun 2024 5:44 PM IST
bomb threat mail, 13 years boy, delhi airport,

టీవీ వార్తలు చూసి.. విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ చేసిన బాలుడు  

ఇప్పుడున్న తరం పిల్లలు టీవీలు.. ఫోన్లు.. ఎక్కువ చూస్తున్నారు. అందులో వచ్చే సినిమాలు కానీ ఇతర వాటిని అనుసరిస్తుంటారు. తాజాగా ఓ బాలుడు కలకలం సృష్టించాడు. దేశంలో వరుసగా పలు విమానాశ్రాలతో పాటు స్కూళ్లు, ఇతర చోట్లకు బాంబు బెదిరింపు కాల్స్ వెళ్లాయి. తరచూ ఈ వార్తలు టీవీల్లో వచ్చాయి. ఇక వీటిని చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు చేసిన పనితో అందరూ కంగారుపడ్డారు. సరదా కోసం టొరంటో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు.

ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. గత మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి టొరంటో వెళ్లడానికి ఎయిర్‌ కెనడా విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఓ బాలుడు టీవీల్లో వార్తలను చూసి విమానంలో బాంబు పెట్టినట్లు.. ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ మెయిల్‌కు మెసేజ్‌ పంపి బెదిరించాడు. రాత్రి 10.50 గంటల సమయంలో ఈ మెసేజ్‌ రాగానే వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఆపి మరీ తనిఖీలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్‌ మెయిల్‌గా గుర్తించారు. ఇక చివరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 13ఏళ్ల బాలుడు మెయిల్‌ పంపినట్లు గుర్తించారు. ఆ బాలుడు బాంబు థ్రెట్‌ మెయిల్ పంపేందుకు ఫేక్‌ మెయిల్‌ క్రియేట్‌ చేశాడని పోలీసులు తెలిపారు. మెయిల్‌ పంపిన తర్వాత అతను అకౌంట్‌ను కూడా డెలిట్ చేశారని చెప్పారు పోలీసులు. కాగా.. బాలుడిని కనిపెట్టి ప్రశ్నించగా.. ఈ విషయాలు బయటపడ్డాయన్నారు. సరదా కోసమే బాంబు బెదిరింపు మెయిల్ చేశారనని బాలుడు ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పాడు. టీవీ వార్తల్లో తాను ఇలాంటి న్యూస్ చేసి చేశారనని చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు.

Next Story