ఐదేళ్లలోపు పిల్లలకు 'బ్లూ ఆధార్'.. అప్లై చేసుకోండిలా..

దేశంలో ఉన్న పౌరులందరికీ ఆధార్‌ గుర్తింపు కార్డు అవసరం.

By Srikanth Gundamalla  Published on  22 Feb 2024 11:36 AM IST
blue aadhaar,   five years child, UIDAI,

 ఐదేళ్లలోపు పిల్లలకు 'బ్లూ ఆధార్'.. అప్లై చేసుకోండిలా..

దేశంలో ఉన్న పౌరులందరికీ ఆధార్‌ గుర్తింపు కార్డు అవసరం. ప్రస్తుతం ఇదే గుర్తింపు కాడు ప్రతి విషయంలోనూ అవసరం ఉంటుంది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందాలన్నా.. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్స్‌ పొందాలన్నా ఆధార్‌ కంపల్సరీ. ఇక బ్యాంకులు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర పనుల కోసం ఆధార్‌నే మస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆధార్‌ ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. దేశంలో ఉన్న పసికందు నుంచి పండు ముసలి వరకు అందరూ ఆధార్‌ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఐదేళ్ల లోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం బ్లూ ఆధార్‌ (బాల ఆధార్‌) కార్డును అందిస్తోంది. 2018లో UIDAI ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా ‘బాల్ ఆధార్’ కార్డును ఆవిష్కరించింది. ఈ ఆధార్‌ కార్డు పెద్దలకు జారీ చేయబడే ప్రామాణిక తెల్లని కార్డు లాగా కాకుండా.. నీలం రంగులో ఉంటుంది. ఈ కార్డు ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కేటాయించింది యూఐడీఏఐ. ఈ కార్డు కూడా మూమూలు ఆధార్‌ కార్డుల్లానే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ బ్లూ ఆధార్‌ కార్డును జారీ చేస్తారు. తాత్కాలికంగా (ఐదు సంవత్సరాల వ్యాలిడిటీతో) జారీ చేసే ఈ కార్డుకు బయోమెట్రిక్‌ను తీసుకోరు. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

అయితే.. ఐదేళ్లు వచ్చే లోపు చిన్నారులను స్కూళ్లలో జాయిన్‌ చేస్తుంటారు తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో పిల్లలను నర్సరీల్లో చేర్చాలన్నా.. రైల్వే, విమాన టికెట్‌ బుకింగ్‌ సమయంలో కూడా ఈ బ్లూ ఆధార్‌ కార్డు తప్పని సరి అవుతోంది. కాబట్టి పసికందులకు కూడా ప్రతి ఒక్కరూ బాల ఆధార్‌ కార్డును తీసుకోవడం మంచిది.

బాల ఆధార్‌ కార్డును కోసం దరఖాస్తు చేసుకోండిలా..

అవసరమైన పత్రాలు: జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు

* ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అపాయింట్‌మెంట్‌ బుక్ చేసుకోవాలి

* చైల్డ్‌ ఆధార్‌లోకి వెల్లి న్యూ ఆధార్‌పై క్లిక్ చేయాలి

* మొబైల్ నెంబర్, వన్‌ టైమ్ పాస్‌వర్డ్‌తో కన్ఫార్మ్‌ చేయాలి

* ఐదేళ్ల లోపు చిన్నారి పేరు, పేరెంట్స్ వివరాలు, డేటాఫ్ బర్త్, తల్లిదండ్రుల చిరునామా నమోదు చేయాలి

* మీ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకుని బ్లూ ఆధార్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి

* వారం నుంచి పది రోజుల్లో బ్లూ ఆధార్‌ పోస్టులో ఇంటికి వస్తుంది

Next Story