బెంగళూరు నగరంలో ఎన్ని కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో తెలుసా..?
Bengaluru has 125 containment zones.దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కర్ణాటక రాజధాని
By M.S.R Published on 3 Jan 2022 1:26 PM IST
దేశంలోని పలు నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దీంతో అధికారులు పలు ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్స్ గా ప్రకటించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) జారీ చేసిన డేటా ప్రకారం, జనవరి 2 నాటికి బెంగళూరు నగరం అంతటా మొత్తం 125 COVID-19 కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి. గత వారంలో నగరంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా.. కంటైన్‌మెంట్ జోన్‌ల సంఖ్య డిసెంబర్ 26, 2021న ఉన్న 98 కంటైన్‌మెంట్ జోన్‌ల నుండి జనవరి 2, 2022 నాటికి 125 జోన్‌లకు పెరిగినట్లు డేటా ద్వారా తెలుస్తోంది.
బొమ్మనహళ్లిలో 38, బెంగళూరు సౌత్‌లో 15, మహదేవపూర్‌లో 35, బెంగళూరు ఈస్ట్‌లో 12, బెంగళూరు వెస్ట్‌లో 10, యలహంకలో 11, దాసరహళ్లిలో మూడు, ఆర్‌ఆర్‌నగర్‌లో ఒక కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయి. బెంగళూరులో గత ఏడు రోజులలో పాజిటివిటీ రేటు 1.22%గా ఉంది.. డిసెంబర్ 26, 2021న 0.54% గా ఉంది. బెంగళూరులో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెద్దగా పెరగలేదు. గడచిన 10 రోజుల్లో అత్యధిక కేసులు బెల్లందూరు వార్డులో నమోదయ్యాయి,
గత 10 రోజుల్లో 26 కేసులు, దొడ్డ నెక్కుండి వార్డులో గత 10 రోజుల్లో 11 కేసులు నమోదయ్యాయి. హగడూరు, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, అరకెరె వార్డుల్లో గడిచిన 10 రోజుల్లో 10 కేసుల చొప్పున నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 3, సోమవారం, కర్ణాటకలో ఓమిక్రాన్ వేరియంట్ కరోనావైరస్ కు సంబంధించి మరో పది కేసులు పెరిగినట్లు ఆరోగ్య మంత్రి కె సుధాకర్ తెలిపారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో ఓమిక్రాన్ సంఖ్య 76కి చేరింది.