చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. చెరువులో ఈవీఎం, బాంబులతో దాడి

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారం జరుగోతంది.

By Srikanth Gundamalla  Published on  1 Jun 2024 1:30 PM IST
bengal, lok sabha election, evm,  pond,

చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తతలు.. చెరువులో ఈవీఎం, బాంబులతో దాడి 

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారం జరుగోతంది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక పోలింగ్‌ స్టేషన్‌లోకి చొరబడింది. ఆ తర్వాత ఈవీఎంను అధికారుల నుంచి లాక్కెళ్లి.. అక్కడున్న చెరువులో పడేసింది. ఆతర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత ఎక్కువయ్యాయి.

పోలీసులు ఈ మేరకు వివరాలను తెలిపారు. కుల్తాలీ గ్రామంలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులు, పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. దాంతో బేనిమాధవ్‌పూర్‌ ఎఫ్‌పీ స్కూల్‌ బూత్‌లోకి ఏజెంట్లను రానివ్వకుండా కొందరు అడ్డుకున్నారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. వీవీపాట్‌ తో కూడిన ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు.

ఇక పోలింగ్‌ సిబ్బంది సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలానికి వెళ్లారు. అల్లరి మూకలను చెదరగొట్టారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. సెక్టార్‌ పరిధిలోని మొత్తం 6 బూత్‌లలో పోలింగ్ ప్రక్రియ అంతరాయం లేకుండా సాగుతోందని చెప్పారు. ఈవీఎంను చెరువులో పడిసన చోట కొత్త ఈవీఎం, పేపర్లను అధికారికి అందించినట్లు బెంగాళ్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ వివరించారు.

ఇక బెంగాల్‌లోని కోల్‌కతా జాదవ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. భాంగర్‌లోని సతులియా ప్రాంతంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, సీపీఐ (ఎం) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో.. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అంతటితో ఆగని ఆయా పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబులతో దాడులు చేసుకున్నారు. పలువురు ఐఎస్‌ఎఫ్‌ సభ్యులకు గాయాలు అయ్యాయనీ.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Next Story