బెంగాల్‌కు ఏదైనా జరిగితే.. ఆ రాష్ట్రాలను తగలబడతాయి: మమతా బెనర్జీ

వైద్యురాలి హత్యాచార సంఘటన తర్వాత బెంగాల్‌ రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 Aug 2024 3:30 AM GMT
bengal, cm mamata banerjee, sensational comments,

 బెంగాల్‌కు ఏదైనా జరిగితే.. ఆ రాష్ట్రాలను తగలబడతాయి: మమతా బెనర్జీ

కోల్‌కతా ఆర్‌జీకర్‌ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార సంఘటన తర్వాత బెంగాల్‌ రాష్ట్రంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా.. కేసులో పోలీసులపై నా ఆరోపణలు రావడంతో విచారణ సీబీఐకి అప్పగించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా ఘటనలను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ తగలబడితే.. తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు ఢిల్లీ కూడా తగలబడతాయని అన్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలంటూ సీఎం మమతా బెనర్జీ అన్నారు.

కోల్‌కతాలో తృణమూల్‌ విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ ఈ కామెంట్స్ చేశారు. కాగా.. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ సీరియస్ అయ్యారు. ఆమె కామెంట్స్‌ను ఖండించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అస్సాంను బెదిరించేందుకు మమతకు ఎంత ధైర్యం అన్నారు. మాపై కళ్లు ఎర్రవి చేసి చూడకండి.. మీ విఫల రాజకీయాలతో దేశాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించకండి అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం హిమంత బిశ్వశర్మ పోస్టుపెట్టారు.



రాజ్యాంగ పదవిలో ఉన్న మమతా బెనర్జీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజందార్ ప్రశ్నించారు. ఆపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అఇత్‌షాకు లేఖ రాశారు. తానెప్పుడూ ప్రతీకారాన్ని కోరుకోలేదు అనీ.. కానీ ఇప్పుడు ఏది అవసరమైతే అది చేయండి అంటూ సుకాంత ముజందార్‌ లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు డాక్టర్‌ హత్యాచార సంఘటనపై బెంగాల్ మమతా బెనర్జీ కీలక కామెంట్స్ చేశారు. అత్యాచార సంఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదన్నారు. రేపిస్ట్‌లకు ఉరిశిక్ష పడేలా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరిస్తామని చెప్పారు. వచ్చే వారమే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామన్నారు. ఒక వేళ ఈబిల్లును గవర్నర్ ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ ముందు ధర్నా చేస్తానని చెప్పారు సీఎం మమతా బెనర్జీ. అయితే.. ఆందోళన చేస్తున్న డాక్టర్లు విధుల్లో పాల్గొనాలని కోరారు. మరోవైపు ట్రైనీ డాక్టర్‌ సంఘనలో విచారణ చేపట్టిన సీబీఐ 16 రోజులు గడుస్తున్నా ఎప్పటికీ ఎలాంటి న్యాయం చేయలేదంటూ వ్యాఖ్యానించారు.

Next Story