నన్ను తిట్టండి.. కానీ రాష్ట్రాన్ని దూషించకండి: బెంగాల్ సీఎం మమత
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం రేపింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 8:30 PM ISTనన్ను తిట్టండి.. కానీ రాష్ట్రాన్ని దూషించకండి: బెంగాల్ సీఎం మమత
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆరోపణలను ఖండించారు.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సంఘటనలో అన్ని విధాలుగా తాము సహకరిస్తున్నామని సీఎం మమతా బెనర్జీ చెప్పారు. అయినా కూడా విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారని అన్నారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని అర్థమైందనీ మమత చెప్పారు. కావాలంటే తనని ఎంతైనా తిట్టాలనీ.. కానీ రాష్ట్రాన్ని దూషించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐకి తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు బెంగాల్‌లో సృష్టిచేందుకు బీజేపీ, సీపీఎం ప్రయత్నిస్తున్నానమి మమతా బెనర్జీ అన్నారు. నిరసనలు చేస్తున్న వైద్యులు దయచేసి విధుల్లో చేరాలని ఆమె కోరారు.
ట్రైనీ డాక్టర్ పై హత్యాచార సంఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెపై సామూహిక హత్యాచారం జరిగి ఉండొచ్చే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు తాజాగా తెలిసింది. తమ కుమార్తె మృతిపై ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.