బ్యాంకు ఖాతాలకు మళ్లీ కేవైసీ.. కారణమిదే..

ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఆర్థిక అవరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  6 March 2024 6:34 AM GMT
banks, introduce,  kyc, verification,

బ్యాంకు ఖాతాలకు మళ్లీ కేవైసీ.. కారణమిదే..

ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. ఆర్థిక అవరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. కొందరికి బ్యాంకు ఖాతాలు ఒకటికి మించి కూడా ఉంటాయి. ఇదంతా కూడా సహజమే. అయితే.. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరిచిన పలు బ్యాంకు ఖాతాలను కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటి సూచిచింది. బ్యాంకుల్లో ఖాతాలను, ఖాతాదార్లను గుర్తించడానికి అదనపు ధృవీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు. వినియోగదారు సమాచారాన్ని మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి పెట్టాయి.

ఒకే ఫోన్‌ నెంబర్‌తో వివిధ బ్యాంకు ఖాతాలు కలిగిన వారు కేవైసీ చేయాల్సి రావొచ్చు. వీరితో పాటు వివిధ రకాల డాక్యుమెంట్లతో వేర్వేరు అకౌంట్లు తెరిచిన వారు కూడా అదనపు సమాచారం బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరోసారి కేవైసీ అప్‌డేట్‌ చేయాల్సి వస్తుంది.

ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఈ చర్యలను చేపట్టింది ప్రభుత్వం. ఇందుకోసమే కమిటీ కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల్లో పాస్‌పోర్టు, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఏ కార్డ్‌, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాల్లో ఏదో ఒకదానిని ఉపయోగించి ఖాతాను తెరిచే వీలుంది. ఇప్పటి వరకు చాలా మంది వీటిల్లో ఏదో ఒకటి ఉపయోగించే బ్యాంకు ఖాతాలను తెరిచారు. అలాంటి వారు పాన్, ఆధార్, యునిక్‌ మొబైల్ నెంబర్ వాటితో సెంకడరీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జాయింట్ ఖాతాలను కూడా అకౌంట్‌ అగ్రిగేటర్ల నెట్‌వర్క్‌ యాక్సెస్‌ చేయడానికి వీలు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

Next Story