అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ

బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య రామమందిరాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.

By Srikanth Gundamalla
Published on : 25 Jun 2024 12:57 AM

ayodhya, temple, rain, water leakage ,

అయోధ్య రామాలయంలో వర్షపు నీరు లీకేజీ

బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో అయోధ్య రామమందిరాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. దేశప్రజలు కూడా ఈ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం జరగడం.. బాల రాముడిని ఇక్కడ ప్రతిష్టించి ఆలయాన్ని ప్రారంభించుకోవడంతో హిందువులంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే..తాజాగా ఈ ఆలయం గర్భగుడిలో ఒక్క వర్షానికే నీరు వచ్చి చేరింది. ఆలయాన్ని ప్రారంభించి ఏడాది కూడా కాలేదు. అప్పుడే లీకేజీలు ఏర్పడటంపై విమర్శలు వస్తున్నాయి.

తొలిసారి వర్షం కురిసినప్పుడే గర్భాలయంలోకి నీరు వచ్చి చేరాయని రామాలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ చెప్పారు. దాంతో.. రామ మందిర నిర్మాణ పటిష్టతపై భక్తులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఆలయ పైభాగాన్ని సరిగ్గా అమర్చని వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణ దశలో ఉన్న సమస్యలను గుర్తించి.. త్వరగా పరిష్కరించాలన్నారు. ఇది వర్షాకాలం అనీ.. రాబోయే రోజులు వరుసగా వానలు పడితే పరిస్థితేంటని సత్యేంద్ర దాస్ అన్నారు. వచ్చే ఏడాది కల్లా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. ఈ పనులు ఏడాది లోపు పూర్తయ్యే పరిస్థితులు కనబడటం లేదని సత్యేంద్ర దాస్ అన్నారు.

ప్రస్తుతం ఏర్పడిన సమస్యను అధికారులు పరిశీలించి పరిష్కరించాలి. వర్షపు నీరంతా రామ్ లల్లా విగ్రహం చుట్టూ వచ్చి చేరాయి. ఆలయంలో లీకేజీ సమస్య ముఖ్యమైంది. దానిని త్వరగా పరిష్కరించాలి" అని సత్యేంద్ర దాస్ అధికారులను కోరారు.

Next Story