అయోధ్య ఆలయ ప్రాంగణంలో తుపాకీ మిస్‌ఫైర్, జవాన్‌కు గాయాలు
అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో అపశృతి చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 March 2024 11:20 AM ISTఅయోధ్య ఆలయ ప్రాంగణంలో తుపాకీ మిస్‌ఫైర్, జవాన్‌కు గాయాలు
అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో అపశృతి చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం అనుకోని సంఘటన జరిగింది. టెంపుల్ కాంప్లెక్స్‌లో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో జవాన్‌కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
అయోధ్య రామాలయంలో మంగళవారం సాయంత్రం రామ్ ప్రసాద్ (50) అనే జవాన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో తన తుపాకీని శుభ్రం చేయాలని భావించాడు. దాంతో..తుపాకీని తుడూస్తు ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ జవాన్ ప్రసాద్ శరీరంలో నుంచి దూసుకెళ్లింది. దాంతో అతనికి తీవ్ర గాయాం అయ్యింది. తుపాకీ పేలుడు శబ్ధం వినగానే భక్తులు కొంత ఆందోళన చెందినట్లు సమాచారం. ఇక ఆలయ అధికారులు వెంటనే స్పందించి రామ్ ప్రసాద్ వద్దకు వెళ్లారు. బుల్లెట్ తగిలి గాయపడ్డ అతన్ని వెంటనే చికిత్స కోసం అయోధ్య మెడికల్ కాలేజ్‌లో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అయోధ్య రామాలయ అధికారులు చెప్పారు. ఇక ప్రస్తుతం గాయపడ్డ జవాన్ పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక జవాన్ రామ్ ప్రసాద్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా అచల్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆరు నెలలుగా రామజన్మభూమి ప్రాంగణలో ఆయన విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందనీ.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో చెప్పినట్లు ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు.