పార్లమెంట్‌లో మహిళపై అత్యాచారం.. క్షమాపణలు చెప్పిన ప్రధాని
Australian PM Apologises After Woman Alleges She Was Raped In Parliament.మహిళలకు రక్షణ కరువైంది. ఇంట్లో, పనిచేసే
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2021 11:41 AM ISTమహిళలకు రక్షణ కరువైంది. ఇంట్లో, పనిచేసే ప్రదేశాల్లో ఎక్కడ రక్షణలేకుండా పోతుంది. సాక్షత్తూ పార్లమెంట్ వేదికగానే మహిళకు ఘోర అవమానం జరిగింది. సమావేశం ఉందని.. అర్జంట్‌గా రావాలని పిలిచి మహిళపై తోటి ఉద్యోగి అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండేళ్ల క్రితం ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన ప్రధాని దిగ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పిన ఆయన.. ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.
2019 మార్చిలో పార్లమెంట్‌లోని రక్షణమంత్రి లిండా రెనాల్డ్ ఆఫీస్‌లో పనిచేసే సీరియల్ సిబ్బంది ఒకరు బాధిత మహిళను సమావేశం ఉందని వెంటనే కార్యాలయానికి రావాలని పిలిచారు. అతడి మాటలు నిజమేనని నమ్మిన మహిళ అక్కడికి వెళ్లింది. అనంతరం ఆమెపై సదరు ఉద్యోగి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఆమె అప్పట్లోనే పోలీసులకు తెలిపింది. అయితే.. తన కెరీర్‌ను ఎక్కడ నాశనం చేస్తారోనని భయపడి అతడిపై అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయంపై ఇటీవల బాధిత మహిళ మీడియాతో మాట్లాడడంతో వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ స్పందించారు. బాధిత మహిళకు క్షమాపణలు తెలియజేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. దీనిపై విచారణ జరిపి కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రక్షణ మంత్రి రెనాల్డ్ మాట్లాడుతూ.. ఆమెపై అత్యాచారం చేసినట్లు అప్పట్లో పోలీసులకు చెప్పిన మాట వాస్తమేనని.. అయితే కేసు పెట్టకుండా ఎవరూ ఒత్తిడి చేయలేదని స్వయంగా ఆమె చెప్పినట్లు వెల్లడించారు.