13 అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎవరిదో గెలుపు..!

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

By Srikanth Gundamalla
Published on : 13 July 2024 10:21 AM IST

assembly, by elections results, 7 states ,

 13 అసెంబ్లీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎవరిదో గెలుపు..!

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆయా స్థానాల్లో శనివారం మధ్యాహ్నం వరకే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీఏ, విపక్ష కూటమి ఇండియా కూటమి ఎదుర్కొంఉటన్న తొలి పరీక్ష ఇదే. దాంతో.. ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో అని ఆసక్తి నెలకొంది.

ఉప ఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానాలివే..

వెస్ట్‌బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లోని 2 అసెంబ్లీ స్థానాలు, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించారు. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతున్న సందర్బంలో కొన్ని పార్టీలు ముందంజలో ఉన్నాయి.

బీహార్‌లోని రూపౌలి స్తానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రాలో బీజేపీ, హమీపుర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత ముందంజలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌.. మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని మంగలూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

Next Story