ఉద్యోగులకు అస్సాం సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ రెండ్రోజులు వెకేషన్‌కు వెళ్లండి
ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 11 July 2024 5:02 PM ISTఉద్యోగులకు అస్సాం సర్కార్ గుడ్‌న్యూస్.. ఆ రెండ్రోజులు వెకేషన్‌కు వెళ్లండి
ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు అస్సాం సర్కార్ ఏటా ఏదో ఒక నెలలో రెండ్రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులను తీసుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ రెండ్రోజుల ఒత్తిడిని పక్కన పెట్టి తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు ఈ వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగులుకు రెండ్రోజుల పాటు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటించింది.
నవంబర్ 6, 8 తేదీల్లో ఉద్యోగులు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు అని అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓప్రకటనలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తామామలతో సమయం గడిపేందుకు హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం రెండ్రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్ 6, 8వ తేదీల్లో ఈ సెలవులను ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు’ అని పేర్కొంది. అయితే, 7వ తేదీ ఛత్ పూజ , 9వ తేదీ రెండో శనివారం కావడంతో ఉద్యోగులకు మొత్తం నాలుగు రోజులు కలిసొచ్చిందని పేర్కొంది.
ఈ సాధారణ సెలవులను వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత ఆనందం కోసం మాత్రం ఉపయోగించుకోకూడదు అని హిమంత ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపింది. వారిని గౌరవించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రభుత్వం సూచించింది. కాగా.. తల్లిదండ్రులు, అత్తమామలు లేని ఉద్యోగులు ఈ సెలవులకు అర్హులు కాదని తన ప్రకటనలో స్పష్టం చేసింది.