ముస్లింలు ఎక్కువ మంది కండోమ్‌లు వాడుతారు.. మోదీకి అసదుద్దీన్ కౌంటర్
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 12:26 PM ISTముస్లింలు ఎక్కువ మంది కండోమ్‌లు వాడుతారు.. మోదీకి అసదుద్దీన్ కౌంటర్
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి కౌంటర్ గా వ్యాఖ్యలు చేసే క్రమంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముస్లింలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచాలని చూస్తోందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారని మోదీ అంటున్నారనీ.. కానీ ఎక్కువ మంది ముస్లింలు కండోమ్‌లు వాడతారంటూ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.
ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే భయాన్ని ప్రధాని సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఒవసీ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గిందని చెప్పారు. ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతారనీ.. ఇలా చెప్పడానికి తనకు సిగ్గుగా లేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలు మెజార్టీ వర్గం అవుతారనే భయాన్ని హిందువుల్లో ప్రధాని మోదీ పెంచే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒవైసీ ఆరోపించారు. ఎంతకాలం ముస్లింల పట్ల హిందువుల్లో భయాన్ని సృష్టిస్తారంటూ నిలదీశారు. తమ మతం వేరు అయినా కూడా.. తామంతా భారతీయులమే అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ మన తల్లులు, చెల్లెళ్ల మెడలో మంగళసూత్రాలను లాగేసుకుంటుందని ఆరోపించారు. దేశ ప్రజల ఆస్తిని లాక్కుని ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని పంచుతారంటూ ఆరోపణలు చేశారు. చొరబాటుదారులకు పంచుతారంటూ మోదీ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అప్పుడే స్పందించిన కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వాస్తవాల నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే ఈ వ్యాఖ్యలంటూ మండిపడింది.