ఎట్ట‌కేల‌కు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

Aryan Khan Gets Bail After 3 Weeks In Jail.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఎట్టకేలకు

By M.S.R  Published on  28 Oct 2021 5:02 PM IST
ఎట్ట‌కేల‌కు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఎట్టకేలకు దక్కింది. 25 రోజుల తర్వాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ల‌భించింది. గత రెండు రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హై కోర్టులో వాదనలు జరిగాయి. ముంబై విడిచిపెట్టాలని అనుకున్నా అధికారులతో అనుమతి తీసుకోవాలని.. విదేశాలకు వెళ్లాలంటే మాత్రం కోర్టు అనుమతులు తప్పనిసరి అని బాంబే హై కోర్టు తెలిపింది.

రెండ్రోజులుగా ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ తరపున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్ వాదలను వినిపించారు. తమ క్లయింట్లను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ, ఇంత చిన్న కేసులో అవసరం లేకున్నా వారిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. నేరం రుజువు అయితే కేవలం ఏడాది శిక్ష పడే కేసు విషయంలోనే తాము బెయిల్‌ను అడుగుతున్నామని వివరించారు. ఆర్యన్ ఖాన్ వద్ద అసలు ఏమీ దొరకకున్నా అతడి పక్కన ఉన్న వ్యక్తి వద్ద దొరికితే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమో గుర్తించాలని వాదనలు వినిపించారు.

Next Story