రాజకీయాల్లోకి వెళ్లొద్దని ముందే కేజ్రీవాల్‌తో చెప్పా: అన్నా హజారే

రాజకీయాల్లోకి వెళ్లొద్దని కేజ్రీవాల్‌కు ముందే సూచించానని అన్నా హజారే చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 4:42 PM IST
రాజకీయాల్లోకి వెళ్లొద్దని ముందే కేజ్రీవాల్‌తో చెప్పా: అన్నా హజారే

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయన జైలు బయట అడుగు పెట్టాక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఆయన ప్రకటనపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు అన్నా హజారే మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వెళ్లొద్దని కేజ్రీవాల్‌కు ముందే సూచించానని అన్నా హజారే చెప్పారు. అయితే.. ఆయన తన మాట వినలేదని చెప్పారు. తన సలహా విని ఉంటే బాగుండేదని అన్నారు అన్నా హజారే. సామాజిక సేవలోనే నిజమైన విలువ ఉంటుందని కేజ్రీవాల్‌తో తాను చాలా సార్లు చెప్పానని అన్నారు. కానీ.. తన మాట ఎప్పుడూ కేజ్రీవాల్ వినలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో వెళ్లొద్దని తాను మొదట్నుంచి చెబుతున్నానని అన్నారు. ఇప్పుడు జరిగింది చూశాక గతంలో కేజ్రీవాల్‌తో చెప్పిన మాటలను అన్నా హజారే గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ప్రస్తుతం జరిగింది.. జరుగుతున్నదంతా అనివార్యమన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మనసులో ఏముందు తనకు ఏమాత్రం తెలియదని చెప్పారు అన్నా హజారే.

కాగా గతంలో అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిసి ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శిష్యుడిగా పేర్కొనే అరవింద్‌ కేజ్రీవాల్‌పై పలుసార్లు స్పందించారు. గతంలో లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ అరెస్ట్‌ విషయంపైనా అన్నా హజారే అసంతృప్తిని తెలిపారు. ఒకప్పుడు నాతో పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ .. ఇప్పుడు మద్యం విధానాలను రూపొందించడంలో నిమగ్నం కావడంపై నేను తీవ్రంగా కలత చెందా. సొంత చర్యల పర్యవసానమే అరెస్ అంటూ అన్నా హజారే వ్యాఖ్యానించారు.


Next Story