ఆనంద్‌ మహీంద్ర ట్వీట్.. కేసు నమోదు, జరిమానా

ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక వీడియో షేర్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  23 Nov 2023 3:00 PM GMT
anand mahindra, tweet, case booked, rs.10,000 fine,

ఆనంద్‌ మహీంద్ర ట్వీట్.. కేసు నమోదు, జరిమానా

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు ఎక్కడ ఎవరైనా డిఫరెంట్‌గా.. టాలెంటెడ్‌గా కనిపిస్తే చాలు వెంటనే సోషల్‌ మీడియా యూజర్లతో పంచుకుంటుంటారు. అంతేకాదు.. అప్పుడప్పుడు మోటివేషన్‌ కొటేషన్లతో నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. ఆనంద్‌ మహీంద్ర ఒక్కో సారి పెట్టే పోస్టులతో కొందరైతే మంచి క్రేజ్‌ను కూడా సంపాదించుకున్నారు. అయితే.. ఆనంద్‌ మహీంద్ర తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఒక వీడియో షేర్‌ చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆనంద్‌ మహీంద్ర పోస్టు చేసిన వీడియో ప్రకారం.. కొందరు వ్యక్తులు గేట్‌ వే ఆఫ్‌ ముంబై వద్దకు కొన్ని ప్లాస్టిక్‌ సంచులను తీసుకుని వచ్చారు. అయితే.. వారు తీసుకొచ్చిన సంచుల నిండుగా చెత్తాచెదారం ఉంది. ఎండిపువ్వులు.. ఏవేవో వ్యర్థాలను తీసుకొస్తున్నారు. ఆ తర్వాత వాటిన సముద్రంలో పడేశారు. అక్కడే ఉన్న విదేశీయులు (వీడియో ఉన్న ఆడియో బట్టి అర్థం అవుతోంది) వారు చేస్తున్నదానినంతా వీడియో తీయడం ప్రారంభించారు. అయితే.. వీడియో తీస్తున్నా కూడా వారు ఏమాత్రం వెనుకాడలేదు. ఏం చేస్తారు అన్నట్లుగా తల ఊపుతూ కారులో తీసుకొచ్చిన చెత్తనంతా సముద్రంలో పడబోసి వెళ్లిపోయారు. అయితే.. ఈవీడియోను బిజినెస్‌ మ్యాన్‌ ఆనంద్‌ మహీంద్ర ఎక్స్‌ ఖాతాలో రీట్వీట్‌ చేస్తూ.. 'ఇది చూస్తే బాధ కలుగుతోంది. పర్యావరణం పట్ల పౌర దృక్పథం మారకపోతే.. భౌతిక మౌలిక సదుపాయాలలో ఎలాంటి మెరుగుదల నగర జీవన నాణ్యతను మెరుగుపరచదు' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆనంద్‌ మహీంద్ర క్యాప్షన్‌తో అందరూ ఏకీభవిస్తున్నారు. ఆ చెత్తపారబోసిన వ్యక్తులను తిడుతున్నారు.

కాగా.. ఈ వీడియో చివరకు పోలీసుల వరకూ చేరింది. దీనిపై స్పందించిన ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతేకాదు.. ముంబై ఘనవ్యర్థాల నిర్వహణ సంస్థ వారికి రూ.10వేల జరిమానా విధించింది. ఇక వీడియో కనిపించిన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story