పారిపోవాలని అనుకున్న అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్

ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. తాజాగా ఆయన భార్య కిరణ్ దీప్ కౌర్ లండన్ కు పారిపోయేందుకు

By M.S.R
Published on : 20 April 2023 6:00 PM IST

Amritsar airport, Amritpal Singh,  Kirandeep Kaur

పారిపోవాలని అనుకున్న అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్

ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. తాజాగా ఆయన భార్య కిరణ్ దీప్ కౌర్ లండన్ కు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమృత్ పాల్ కు విదేశీ నిధులను సమకూర్చడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో లండన్ వెళ్లేందుకు ఆమె అమృత్ సర్ విమనాశ్రయానికి వచ్చారు. ఇప్పటికే ఆమెపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎల్ఓసీ ని కూడా జారీ చేశారు. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోనే ప్రశ్నించారు. కిరణ్ దీప్ కౌర్ ఎన్నారై. ఆమె పంజాబ్ లో పుట్టినప్పటికీ ఆమె తల్లిదండ్రులు బ్రిటన్ లో స్థిరపడటంతో ఆమె అక్కడే పెరిగారు. అమృత్ పాల్ సింగ్ తో ఆమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. గత ఫిబ్రవరిలో వీరు పెళ్లి చేసుకున్నారు.

Next Story