సీఎం యోగితో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భేటీ

Akshay Kumar meets UP CM Yogi Adityanath.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భేటీ

By సుభాష్  Published on  2 Dec 2020 3:57 AM GMT
సీఎం యోగితో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భేటీ

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ముంబై ట్రైడెంట్‌ హోటల్‌లో మంగళవారం ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన మూవీ 'రామ్‌ సేతు' గురించి యోగితో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం యోగి ముంబైకి చేరుకున్నారు. లక్నో మున్సిపల్‌ బాండ్ల లాంచింగ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే లక్నో మున్సిపల్‌ కార్పొరేషన్‌ గత నెలలో బాండ్‌ ఇష్యూ ద్వారా రూ.200 కోట్లు సమీకరించింది. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తలతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులను కలవనున్నారు. ప్రధానంగా ఫిల్మ్‌ సిటీ ప్రణాళికల గురించి చర్చించిన మొదటి వ్యక్తుల్లో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. వీరిద్దరూ చర్చలు జరుపుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

రామ్‌ సేతు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను అక్షయ్‌ కుమార్‌ ఇటీవల విడుదల చేశారు. అభిషేక్‌ శర్మ డైరెక్ట్‌ చేయనున్న ఈ చిత్రానికి అక్షయ్‌ కుమార్‌ తల్లి అరుణా భాటియాతో పాటు విక్రమ్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మరో వైపు యూపీలోని గౌతమబుద్దనగర్‌ జిల్లా గ్రేటర్‌ నోయిడా మహానగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మించనున్నట్లు యోగి ఆదిత్యానాథ్‌ సెప్టెంబర్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌సిటీ ఏర్పాటుపై చర్చించేందుకు యోగి బుధవారం బాలీవుడ్‌ నిర్మాతల ప్రతినిధి బృందాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it