సుప్రీంకోర్టులో నటి జయప్రదకు ఊరట

నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట దొరికింది.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 2:43 PM IST
actress jayaprada,  supreme court, ESIC case,

 సుప్రీంకోర్టులో నటి జయప్రదకు ఊరట 

నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట దొరికింది. ఈఎస్‌ఐసీ కేసులో జయప్రద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. అంతకుముందు ఇదే కేసులో ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును జయప్రద మద్రాస్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. అయితే.. అక్కడ కూడా ఆమెకు షాక్‌ ఎదురైంది. కిందికోర్టు విధించిన శిక్షను మద్రాస్ హైకోర్టు కూడా సమర్ధించింది. జయప్రద శిక్షకు అర్హురాలే అంటూ వ్యాఖ్యానించింది.

దాంతో.. చివరకు జయప్రద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత ధర్మాసనం.. మద్రాస్‌ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. దాంతో జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది. కాగా.. కేసు వివరాలను చూసినట్లు అయితే.. థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్‌ఐసీ (ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్) కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా జయప్రద నిబంధనలు ఉల్లంఘించారని థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. వారి కంప్లైంట్‌తో జయప్రదతో పాటు ఆమె సోదరుడు రాజాబాబు, బిజినెస్ పార్ట్‌నర్ రామ్‌ కుమార్‌ పై కూడా కేసు నమోదు చేశారు.

Next Story