ఏటీఎంలో దూరిన దొంగలు..డబ్బులు వద్దని ఏం ఎత్తుకెళ్లారో చూడండి..!
పంజాబ్‌లో ఏటీఎంలో దూరిన ఇద్దరు దొంగలు డబ్బులు కాకుండి ఏసీ ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 16 July 2023 1:58 PM ISTఏటీఎంలో దూరిన దొంగలు..డబ్బులు వద్దని ఏం ఎత్తుకెళ్లారో చూడండి..!
జల్సాలకు అలవాటు పడ్డ కొందరు వ్యక్తులు ఈజీగా మనీ సంపాదించేందుకు దొంగతనాల దారిని ఎంచుకుంటారు. దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్, ఏటీఎంలో డబ్బులు ఎత్తుకెళ్లడం వంటివి చేస్తున్నారు. టెక్నాలజీ కాలం కాబట్టి ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటున్నాయి... దాంతో దొంగలు ఈజీగా పట్టుబడుగుతున్నారు. ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు చోరీ చేసిన వారిని, ఏటీఎం మెషీన్‌నే అపహరించిన దొంగలను చూశాం. కానీ పంజాబ్‌లో ఇద్దరు దొంగలు తాము అందరికీ వెరైటీ అని చెప్పారు.
పంజాబ్‌లోని మెగా జిల్లాలోని బాఘ్ పట్టణంలో జరిగిందీ ఈ ఘటన. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం ఉంది. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఏటీఎం దగ్గర ఆగారు. రాత్రి వేళ కావడంతో అక్కడ ఎక్కువగా జనాలు లేరు. ఇదే మంచి సమయంగా భావించారు ఇద్దరు వ్యక్తులు. ఒకడు ఏటీఎం సెంటర్‌లో ఉన్న డస్ట్‌బిన్‌ను తిరగేసి దానిపై ఎక్కాడు. ఇంకేముంది అతను తెచ్చుకున్న వస్తువులను ఏసీ వైర్లను కట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఏటీఎం మెషీన్‌ను చకచకా విప్పేశాడు. కొద్ది సేపట్లోనే ఏసీ మెషీన్‌ను గోడ నుంచి వేరు చేసి అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు. ఇదంతా ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల్లో.. ఆ తర్వాత బయటే ఉన్న మరో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. వీళ్లెక్కడి దొంగలు.. ఏటీఎంలో డబ్బులను విడిచిపెట్టి.. ఏసీని ఎత్తుకెళ్లారు? వెరైటీగా ఉన్నారే అంటున్నారు.
ఇక ఏటీఎంలో ఏసీ ఎత్తుకెళ్లిన ఘటనపై సదురు ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 9న ఈ సంఘటన జరిగిందనీ బ్యాంకు మేనేజర్ చెప్పారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కనీసం విచారణ కోసం బ్యాంకు వరకు కూడా రాలేదని చెప్పారు. పోలీసుల తీరుని విమర్శించారు. అంతకు ముందు బ్యాంకు దగ్గర బైక్‌ను కూడా ఎత్తుకెళ్లారని తెలిపారు. పోలీసులు ఇప్పటికైనా స్పందించాలని కోరారు ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్.