గంగూలీ దుకాణంలో టీ ధ‌ర రూ.1000

A Cup of Tea for Rs 1,000 .. మూములుగా ఒక చాయ్ ధ‌ర ఎంత ఉంటుంది. 5 లేదా 10 లేదా 15 లేదా 20 లేదా 100 వ‌ర‌కు ఉండొచ్చు.

By సుభాష్  Published on  21 Nov 2020 3:59 PM GMT
గంగూలీ దుకాణంలో టీ ధ‌ర రూ.1000

మూములుగా ఒక చాయ్ ధ‌ర ఎంత ఉంటుంది. 5 లేదా 10 లేదా 15 లేదా 20 లేదా 100 వ‌ర‌కు ఉండొచ్చు. కానీ అత‌డి షాపులో మాత్రం టీ ధ‌ర మాత్రం అచ్చంగా రూ.1000. అంత పెట్టి ఎవ‌రైనా టీ తాగుతారా..? అని మీరు అడ‌గ‌వ‌చ్చు కానీ.. ఆ టీ కోసం ఆ రాష్ట్ర వాసులే కాక ప‌క్క రాష్ట్రం నుంచి వ‌స్తున్నారు. ఎందుకంటే.. టీ వ్యాపారంలా కాకుండా వినియోగ‌దారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుండ‌డంతో ఆ టీకి అంత ధ‌ర‌.

కోల్‌క‌త్తాకు చెందిన పార్థ గంగూలీ ఏదైన కొత్త వ్యాపారం చేయాల‌ని అనుకున్నాడు. త‌న స్నేహితుల‌తో ఈ విష‌యం గురించి చ‌ర్చించి.. వారి స‌ల‌హా మేర‌కు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 2014లో నీర్జాస్ టీ దుకాణాన్ని ప్రారంభించాడు. దాదాపుగా 100 రకాల తేనీరు అక్కడ దొరుకుతుంది. టీ రకాన్ని బట్టి ఖరీదు ఉంటుంది. రూ.15 మొదలు వెయ్యి వరకు టీ ధరలు ఉంటాయి. ఇది టీ త‌యారు చేసే తేయాకు ఆధారంగా ఉంటుంది. వంద రకాల టీలలో కూడా మస్కటెల్ టీ అనే సుగంధితో తయారు చేసే టీ బాగా ఫేమస్ అయ్యింది. ఆ టీ కోసమే అక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో మస్కటెల్ టీని సేవించేందుకు వస్తుంటారట. టీ తాగ‌డం వల్ల మాన‌సికంగా ఉత్తేజం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్య ప‌రంగా మంచిద‌ని.. త్వ‌ర‌లోనే తేనీరు ఆధారంగా చికిత్స అందించే టీ కిన్లిక్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు గంగూలీ తెలిపాడు.

Next Story
Share it