అయోధ్య రామాలయానికి 14 ఏళ్ల బాలిక రూ.52లక్షల విరాళం
అయోధ్య రామాలయానికి ఎంతో మంది ప్రముఖులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 11:40 AM ISTఅయోధ్య రామాలయానికి 14 ఏళ్ల బాలిక రూ.52లక్షల విరాళం
అయోధ్య రామాలయానికి ఎంతో మంది ప్రముఖులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు. సామాన్య భక్తులు కూడా తోచిన విరాళం ఇచ్చి భక్తిని చాటుకున్నారు. అయితే.. తాజాగా ఓ 14 ఏళ్ల బాలిక అయోధ్య రామమందిరానికి ఏకంగా రూ.52లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇంత చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడంతో రామభక్తుల నుంచి సదురు బాలిక ప్రశంసలు అందుకుంటోంది.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏల్ల బాలిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి.. దాని విశేషాలను తెలుసుకుంది. ఇక ప్రజలు కూడా రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇస్తున్నారనే విషయం తెలుసకుంది. దాంతో.. తాను కూడా రామాలయానికి విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. తాను చదివిన కథనలను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు, లాజ్‌పూర్ జైలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు చెప్పింది. 2021లో లాజ్‌పూర్ జైలులో ఉన్న 3200 మంది ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. అలా భవికా తను 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 50వేల కిలోమీటర్లు ప్రయాణించి రాముడి కథలు చెబుతూ 300కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. తద్వారా రూ.52 లక్షల వరకు సేకరించింది. తాను సేకరించిన ఆ మొత్తాన్ని అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది.
అయితే.. భావిక రాముడి కథలను చెప్పడమే కాదు.. 108కి పైగా వీడియోలను రికార్డు చేసి వాటిని యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచింది. ఆ వీడియోలకు కూడా బాగా వ్యూస్ వచ్చాయి. లక్ష మంది వరకు వీక్షించారు. భావిక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కూడా ‘సంఘాష్ సే శిఖర్ తక్’ అనే ఒక పుస్తకాన్ని రాసింది. ఆ పుస్తకాన్ని స్వయంగా రాష్ట్రపతికి అదజేసింది.