మ‌రో 43 మొబైల్ యాప్‌ల‌పై కేంద్రం నిషేధం.. ఇక‌పై వీటిని వాడ‌లేరు

43 mobile apps banned.. భార‌త దేశ సార్వ‌భౌమాధికారం, స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త దృష్ట్యా ఇప్ప‌టికే టిక్ టాక్‌, వీచాట్

By సుభాష్  Published on  25 Nov 2020 1:25 AM GMT
మ‌రో 43 మొబైల్ యాప్‌ల‌పై కేంద్రం నిషేధం.. ఇక‌పై వీటిని వాడ‌లేరు

భార‌త దేశ సార్వ‌భౌమాధికారం, స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త దృష్ట్యా ఇప్ప‌టికే టిక్ టాక్‌, వీచాట్ వంటి వంద‌ల యాప్‌ల‌ను నిషేదించిన కేంద్ర ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో 43 మొబైల్ యాప్‌ల‌ను నిషేదించింది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టం సెక్ష‌న్ 69ఎ కింద వీటిని నిషేధించిన‌ట్లు ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. తాజాగా నిషేదించిన వాటిలో అలీఎక్స్‌ప్రెస్‌, స్నాక్ వీడియో, మ్యాంగో టీవీ ఉన్నాయి.

గ‌ల్వాన్ లోయ వ‌ద్ద దుందుడుగు చ‌ర్య‌ల‌కు దిగిన చైనాకు బుద్దిచెప్పేందుకు జూన్‌లో ఆ దేశానికి చెందిన 59 యాప్‌ల‌ను ఈ ఏడాది జూన్‌లో నిషేదం విధించిన కేంద్ర ప్ర‌భుత్వం.. సెప్టెంబ‌ర్‌లో మ‌రో 118 యాప్‌ల‌పై కూడా నిషేధించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుత నిషేధానికి గురైన యాప్‌లు ఇవే..

అలీస‌ప్ల‌య‌ర్స్‌

అలీబాబా వ‌ర్క్‌బెంచ్‌

అలీఎక్స్‌ప్రెస్‌-స్మార్ట‌ర్ షాపింగ్, బెట‌ర్ లివింగ్‌

అలీపే క్యాషియ‌ర్‌

లాలామూవ్ ఇండియా - డెలివ‌రీ యాప్‌

స్నాక్ వీడియో

క్యామ్‌కార్డ్ - బిజినెస్ కార్డ్ రీడ‌ర్‌

క్యామ్‌కార్డ్ - బీసీఆర్ (వెస్ట‌ర్న్‌)

సోల్ - ఫాలో ద సోల్ టు ఫైండ్ యూ

చైనీస్ సోష‌ల్ - ఫ్రీ ఆన్‌లైన్ డేటింగ్ వీడియో యాప్‌

డేట్ ఇన్ ఏషియా - డేటింగ్ & చాట్

వీడేట్ - డేటింగ్ యాప్‌

ఫ్రీ డేటింగ్ యాప్ - సింగోల్‌, స్టార్ట్ యువ‌ర్ డేట్‌

అడోర్ యాప్‌

ట్రూలీచైనీస్ - చైనీస్ డేటింగ్ యాప్‌

ట్రూలీ ఏషియ‌న్ - ఏషియ‌న్ డేటింగ్ యాప్‌

చైనాల‌వ్‌

డేట్‌మై ఏజ్‌

ఏషియ‌న్‌డేట్‌

ఫ్ల‌ర్ట్‌విష్‌

గ‌య్స్ ఓన్లీ డేటింగ్‌

ట్యూబిట్‌

వీవ‌ర్క్‌చైనా

ఫ‌స్ట్ ల‌వ్ లివ్‌

రెలా-లెస్బియ‌న్ సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌

క్యాషియ‌ర్ వాలెట్‌

మ్యాంగో టీవీ

ఎంజీటీవీ-హ్యూన‌న్ టీవీ అఫీషియ‌ల్ టీవీ యాప్‌

వియ్‌టీవీ

వియ్‌టీవీ లైట్‌

ల‌క్కీ లైవ్‌

తావోబావో లైవ్‌

డింగ్‌టాక్‌

ఐడెంటిఫై బి

ఐసోల్యాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్‌

బాక్స్‌స్టార్

హీరోస్ ఇవాల్వ్‌డ్‌

హ్యాపీ ఫిష్‌

జెల్లీపాప్ మ్యాచ్

మంచ్‌కిన్ మ్యాచ్‌

కాన్‌క్విస్టా ఆన్‌లైన్ 2

Next Story
Share it