కారులో పోలీస్ టోపీ..బయట పోలీస్ స్టిక్కరింగ్..పోలీసులకే బురిడీ
By రాణి Published on 14 April 2020 9:32 AM GMT- పోలీస్ స్టిక్కరింగ్ తో అక్రమంగా మద్యం రవాణా
ఇరవైయొక్క రోజులుగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరో 19 రోజులు ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికే మద్యం, కల్లు దొరక్క చాలా మంది మతి స్థిమితం కోల్పోయి ఆస్పత్రుల పాలవుతున్నారు. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించేకన్నా వీరు చేసే పనులు డాక్టర్లకు మరింత తలనొప్పులుగా మారుతున్నాయి.
ఆర్థిక సంక్షోభం కాదు..ఆరోగ్య సంక్షోభాన్ని ఓడిద్దాం : సోనియాగాంధీ
రెండ్రోజుల క్రితం చంపాపేట్ లో రోడ్డుపన్ననున్న వారికి మద్యం పెడుతూ టిక్ టాక్ చేసిన యువకుడిని సరూర్ నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కారులో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను నర్సంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చెందిన రాజుకుమార్, రవి అనే ఇద్దరికి నర్సంపేటలో శ్రీనివాస వైన్స్ ఉంది. లాక్ డౌన్ నియమ నిబంధనలను మరిచిపోయి అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న ఆకాంక్షతో షాపులోని మద్యాన్ని తరలించే ప్రయత్నం చేశారు. తమ కారుకు నకిలీ పోలీస్ స్టిక్కరింగ్ వేసి, కారు లోపల పోలీస్ టోపీ పెట్టి నిజమైన పోలీసులకే కుచ్చుటోపీ పెట్టారు.
నడిరోడ్డుపై మద్యం పంపిణీ చేస్తూ టిక్ టాక్..ఆఖరికి ఇలా..
కరీమాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్లే దారిలో ఉన్న అన్ని చెక్ పోస్టుల్లో తాము పోలీసులమని చెప్పి బురిడీ కొట్టించారు. ఆఖరికి కారులోకి మద్యం బాటిళ్లు పెడుతూ నర్సంపేట పెట్రోలింగ్ పోలీసులకు పట్టుబడ్డారు. కారుతో పాటు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నర్సంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎంతచెప్పినా, ఏం చెప్పినా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉండాలన్న కనీస జ్ఞానం లేకుండా పోలీసుల కళ్లుగప్పి మరీ అక్రమ కార్య కలాపాలకు పాల్పడుతున్నారు.