నడిరోడ్డుపై మద్యం పంపిణీ చేస్తూ టిక్ టాక్..ఆఖరికి ఇలా..

By రాణి  Published on  13 April 2020 2:12 PM GMT
నడిరోడ్డుపై మద్యం పంపిణీ చేస్తూ టిక్ టాక్..ఆఖరికి ఇలా..

మీరు టిక్ టాక్ చేస్తున్నారా ? సినిమా పాటలు, డైలాగ్ లను అనుకరించడం, లేదా మీకు తోచిన వంటలు,హెల్తీ టిప్స్, ప్రేమ విశేషాలు ఇలాంటివి మీ ఇంట్లో ఉండి టిక్ టాక్ తో పంచుకుంటే ఓకే. కానీ కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ టిక్ టాక్ చేస్తే మాత్రం అంతే సంగతులు. ముఖ్యంగా మందుబాబులు మద్యం సీసాలు పట్టుకుని రోడ్లపై కనిపించారా..మీ పని అంతే..మీ ఉజ్వల భవిష్యత్ ను మీ చేతులారా మీరే నాశనం చేసుకున్నవారవుతారు. ఇప్పటికే రోడ్డుమీద అనవసరంగా తిరుగుతున్నవారి వాహనాలను సీజ్ చేస్తూ..పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలే క్వారంటైన్ కాలం. కుటుంబ పోషణకోసం దాచుకున్న డబ్బులను పోలీసుల ఫైన్లు కట్టడం కోసం వాడటం అవసరమా చెప్పండి. అందుకే ఏం పని లేకుంటే జర ఇంట్లోనే భద్రంగా ఉండండి.

Also Read : రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా

రెండ్రోజుల క్రితం చంపాపేట్ కు చెందిన కుమార్ అనే వ్యక్తి చంపాపేట్ లో నడిరోడ్డుపై ఫుల్ బాటిల్ పట్టుకుని మద్యం పోస్తున్న వీడియో టిక్ టాక్ లో బాగా వైరల్ అయింది. ఫలితంగా ఇప్పుడతను కటకటాలు లెక్కపెడుతున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ధృవీకరించారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, రోడ్డు పక్కనున్న వారికి మందు పంపిణీ చేసిన కుమార్ ను చంపాపేటలో గల అతడి నివాసంలో సరూర్ నగర్ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని సెక్షన్ 34(ఎ) ఆఫ్ తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read : మద్యం ప్రియులకు సీఎం జగన్‌ సూచనలు

ప్రభుత్వం విధించిన నియమ, నిబంధనలకు ఎవ్వరూ అతీతం కాదని, ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే మాత్రం కటాకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. కరోనా తగ్గుముఖం పట్టేంత వరకూ ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా సూచించారు.

Next Story
Share it