రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా

By రాణి  Published on  13 April 2020 11:59 AM GMT
రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా

ముఖ్యాంశాలు

  • రెండు గంటల్లో లక్షా 85 వేలు హుష్ కాకీ
  • పోలీసులకు ఫిర్యాదుతో వెలుగుచూసిన వైనం

ఈ మధ్య కరోనా మోజులో పడి సైబర్ క్రైం వార్తలను ఎవ్వరూ గ్రహించట్లేదు. గతంలో అయితే ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్ ఖాతాల వివరాలు, ఏటీఎం పిన్ వివరాలు అడిగితే చెప్పొద్దని సూచించడంతో చాలా మంది అప్రమత్తమయ్యారు. కానీ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా తెలివి మీరారు. పేటీఎం ను వాడుకుని లక్షలు కొల్లగొడుతున్నారు. కరోనా డ్యూటీలో పడి తమనెవరు పట్టించుకుంటారనుకున్నారో ఏమోగానీ ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారినే టార్గెట్ చేశారు.

Also Read : వావ్..ప్రగతి ఆంటీ తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీసిందిగా..

బేగంపేట్ కుందన్ బాగ్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి శ్రీనివాస్ రెడ్డికి మీ పేటీఎం బ్లాక్ అయింది. మేం చెప్పినట్లు చేయండి. మళ్లీ అన్ బ్లాక్ అవుతుందని గాలం వేశారు. ఫోన్ లైన్ లో ఉన్న వ్యక్తి అడిగినవన్నీ చెప్పేశారు. ఆఖరికి తన మెసేజ్ వచ్చిన కేవైసీ నెంబర్ కూడా చెప్పడంతో..రెండు గంటల్లో లక్షా 85 వేల నగదును దోచేశాడు సైబర్ నేరస్తుడు. మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ రెడ్డి వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో ఇదొక్క కేసే కాదు. సంజీవరెడ్డి నగర్ కు చెందిన హరీష్ రాజ, సికింద్రాబాద్ కు చెందిన కాశీనాథ్, కుత్బుల్లాపూర్ కు చెందిన సాంబశివరావులు కూడా ఇదే తరహాలో మోసపోయారు. హరీష్ అకౌంట్ నుంచి 32 వేలు, కాశీనాథ్ నుంచి లక్షా 30 వేలు, సాంబశివరావు అకౌంట్ నుంచి రూ.8వేలను దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు.

Also Read : ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ

కాబట్టి మీకు కూడా ఏదైనా పేటీఎం నుంచి కాల్ చేస్తున్నట్లు వస్తే వెంటనే అప్రమత్తమవ్వండి. వాళ్లు చెప్పేవన్నీ నమ్మి మీకు వచ్చే మెసేజ్ లలో ఉండే కేవైసీ నంబర్లను వారికి చెప్పకండి. చెప్పారో మీ అకౌంట్లో ఉన్న డబ్బుల మీద ఆశ వదులుకోవాల్సిందే. అసలే ఉద్యోగాలు లేక, జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త..!

Next Story