'బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్'... ట్విట్టర్‌లో 'లోకేష్‌' ప్రశంసలు

By Newsmeter.Network  Published on  8 Dec 2019 1:51 PM IST
బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్... ట్విట్టర్‌లో లోకేష్‌ ప్రశంసలు

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రూల‌ర్‌’. సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్‌ చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి వన్నీ ట్రైలర్‌లో చూపించి సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌పై బాలయ్య అల్లుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు.

'ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?’’ బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా ‘రూలర్’ ట్రైలర్ అదుర్స్. దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా!' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

ఈ మూవీలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించగా, రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.



Next Story