�
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డారు. ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్ అని అభివర్ణించారు. సీఎం జగన్ పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేయిస్తారని ఆరోపించారు. జగన్ చేతగాని వాడు అని, ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు అంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించాడు. నన్ను బదనాం చేయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ శునకానందం పొందుతున్నారని ట్విట్టర్ ఖాతాలో మండిపడ్డారు.