నేచుర‌ల్ స్టార్ నాని మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్‌ బాబు మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ‘వైలెన్స్‌ కావాలన్నారుగా.. ఇస్తా.. ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా’ అంటూ విడుదల తేదీ వివరాలున్న ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు.

ఇందులో రెండు చేతుల‌తో రెండు తుపాకిలు పట్టుకుని కాలుస్తూ..’ఈ క్షణం నుండి నా శత్రువులకి నా దయా దాక్షిణ్యాలే దిక్కు’ అని షేక్‌ స్పియర్‌ చెప్పిన మాట ఈ పోస్టర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. 2020 ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ ఈ చిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌, అతిథిరావు హైదరీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంగీతం అందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.