'నాని' కొత్త లుక్ ఆ సినిమా కోసమేనా ?

By Newsmeter.Network  Published on  9 Dec 2019 8:02 AM GMT
నాని కొత్త లుక్ ఆ సినిమా కోసమేనా ?

కొత్త టాలెంట్ ను కొత్త కథలను జడ్జ్ చేయడంలో హీరో నానికి మంచి పట్టు ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో రెగ్యులర్ గా వినిపించే డైలాగ్. అందరూ అనుకున్నట్లుగానే 'నాని' కూడా ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ని సృష్టించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరోగా నాని హవానే కొనసాగుతుంది. అయితే తాజాగా నాని ఓ ఇంట్రస్టింగ్ లుక్ లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. గుబురుగా పెరిగిన గడ్డంతో మెలితిప్పిన మీసంలో నాని వెరీ స్టైలీష్ గా కనిపిస్తున్నాడు.

Image (1)

బహుశా ఈ లుక్ తన కొత్త సినిమా కోసమేమో. కథ బాగుంటే దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను కూడా పట్టించుకోకుండా, నాని కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే మహేష్ అనే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విని.. అతనితో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. పైగా ఈ చిత్రాన్ని స్వయంగా నానినే నిర్మిస్తాడట. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'వి' షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు. ఇక నాని హీరోగా నటించిన అతని గత చిత్రం 'గ్యాంగ్ లీడర్' బాక్సాఫీస్ వద్ద ఎబౌవ్ ఏవరేజ్ సినిమాగా నిలిచింది.

Next Story