నాని ఆ.. డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్నాడా..?

By Medi Samrat
Published on : 12 Oct 2019 5:06 PM IST

నాని ఆ.. డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తున్నాడా..?

నేచుర‌ల్ స్టార్ నాని.. ఒక‌ప్పుడు ఫ్లాప్ అనేది లేకుండా వ‌రుస‌గా ఆరేడు సినిమాల‌తో స‌క్సెస్ సాధించాడు. ఇలా స‌క్సెస్ ట్రాక్ లో వెళుతున్న నాని కెరీర్ కి 'కృష్ణార్జున యుద్ధం' బ్రేక్ వేసింది. ఆ త‌ర్వాత నాగార్జున‌తో క‌లిసి 'దేవ‌దాస్' సినిమా చేసినా.. ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇటీవ‌ల న‌టించిన 'గ్యాంగ్ లీడ‌ర్' సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో క‌థ‌ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాని ఓ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఓకే చెప్పాడ‌ట‌.

Related image

ఇంత‌కీ.. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే... నందినీ రెడ్డి. నాని - నంద‌నీ రెడ్డి కాంబినేష‌న్ లో 'అలా మొదలైంది' రూపొందింది. ఈ సినిమాతో నాని హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2011లో విడుదలైన ఆ చిత్రం హీరోగా నాని ఎదుగుదలలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా తర్వాత నందినీ రెడ్డి, నాని మళ్లీ కలిసి పని చేయలేదు. ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Image result for Nandini reddy

ఇటీవల 'ఓ బేబీ' సినిమాతో మంచి విజయం దక్కించుకున్న నందినీ.. నాని కోసం మంచి కథ సిద్ధం చేశారట. స్వప్నా సినిమాస్ బ్యానర్ పై స్వప్నాదత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలిసింది.

Next Story