నాని 'జెర్సీ' ని హిందీ లో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఎవ‌రు.?

By Medi Samrat  Published on  15 Oct 2019 1:41 PM GMT
నాని జెర్సీ ని హిందీ లో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఎవ‌రు.?

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా 'మ‌ళ్లీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జెర్సీ'. ఈ సినిమా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విజ‌యం సాధించింది. ఇందులో నాని నటన అద్భుతం. సితార ఎంర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. తెలుగులో రూపొందిన ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు చాలా పోటీప‌డ్డారు. ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.

బాలీవుడ్ లో 'గజని' లాంటి చిత్రంతో మొదటిసారి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నిర్మాతగా పేరుగాంచిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ చిత్రాలు నిర్మిస్తున్న మోస్ట్ హపెనింగ్ నిర్మాతలు దిల్ రాజు, సూర్య దేవర నాగవంశీ లు హిందీలో నిర్మిస్తున్నారు. తెలుగులో 'జెర్సీ' సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి కూడా డైరెక్షన్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story
Share it