మెగా హీరోతో నందినీ రెడ్డి నెక్స్ట్ మూవీ..?
By Newsmeter.Network Published on 7 Dec 2019 10:50 AM GMT
ఓ.. బేబి సినిమాతో సక్సస్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఒక పార్ట్ ను డైరెక్ట్ చేస్తుంది. ఇందులో జగపతి బాబు, అమలాపాల్ తదితరులు నటిస్తున్నారు. అయితే.. నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది అఫిషియల్ గా ప్రకటించకపోయినప్పటికీ.. మెగా హీరో నందినీ రెడ్డి సినిమా ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ మేటర్ ఏంటంటే... మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ హీరోతో నందినీ రెడ్డి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా నందినీ రెడ్డి తెరకెక్కించే ఈ సినిమాని స్వప్న సినిమాస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం లోకేషన్స్ వేటలో ఉన్నారట చిత్ర యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారని తెలిసింది.