ఆ గ్రామ అభివృద్ధికి సహకరించండి!
By Medi SamratPublished on : 25 Oct 2019 2:37 PM IST

ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కలుసుకున్నారు. సాధారణంగా ఎవరినీ కలవని నమ్రత.. వైఎస్ భారతిని కలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నమ్రత వెళ్లి భారతితో భేటీ కావడం వెనుక ఏదో ఉందని సమాచారం.
వివరాళ్లొకెళితే.. అమరావతిలోని తాడేపల్లిలో సీఎం జగన్ ఇంట్లో వైఎస్ భారతితో నమ్రతా శిరోద్కర్ భేటీ అయ్యింది. ఏపీలో మహేష్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలు వైఎస్ భారతికి నమ్రత వివరించింది. ప్రభుత్వం నుంచి బుర్రిపాలెం గ్రామం కోసం సహకారం అందించాలని నమ్రత వైఎస్ భారతిని కోరింది. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉంది.
Next Story