ముఖ్యాంశాలు

  • అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు పెట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశం
  • 15 నిమిషాలు టైమిస్తే 100 కోట్ల మంది అంతు చూస్తా అనే వ్యాఖ్యలపై ఆగ్రహం
  • అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

 

హైదరాబాద్‌ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్ట్ ఆదేశించింది. కరీంనగర్ సభతో పాటు బిహార్‌లోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారంటూ నాంపల్లి కోర్టు లో అడ్వకేట్ కరుణ సాగర్ పిటిషన్ వేశారు. “15 నిముషాలు సమయం ఇస్తే వంద కోట్ల మంది అంతు చూస్తాను” అంటూ గతంలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చేశారని కరుణ సాగర్‌ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో మరో మూడు సార్లు ఆ అంశాన్ని ప్రస్తావించాడంటూ అడ్వకేట్ కరుణసాగర్‌ ఆగస్ట్‌లో పిటిషన్ వేశారు. గతంలో 15 నిమిషాల వ్యవహారం పై కండీషన్ బెయిల్ ఉన్నా.. మరోసారి కోర్ట్ ఉత్తర్వులు ఉల్లగించారంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. నిర్మల్ లో నమోదైన FIR , ఆడియో, వీడియో తో పాటు కండిషన్ బెయిల్ ఆర్డర్ ను పిటిషనర్ ప్రస్తావించారు. దీంతో..అక్బరుద్దీన్ ఓవైసీ పై వెంటనే కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. u / Sec. 153, 153 (ఎ), 153 (బి), 506 కేసు నమోదు చేశారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.