యూరియా సరఫరా పెంచాలని మంత్రిని కోరిన నామా

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Sept 2019 5:46 PM IST

యూరియా సరఫరా పెంచాలని మంత్రిని కోరిన నామా

ఖమ్మం జిల్లా: నాలుగు వారాలకు సరిపడేలా 10 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డిని ఎంపీ నామా కోరారు. శనివారం హైదరాబాద్ లో మంత్రిని కలిసిన నామా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. జిల్లాలో రైతులు ఈ ఏడాది 2, 04, 711 హెక్టార్లలో పంటలు సాగు చేశారాని ఎంపీ తెలిపారు. టీఎస్ మార్క్ ఫెడ్ ఇప్పటి వరకు 27,181.36 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని మంత్రికి వివరించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటం,గోదావరి నదితో పాటూ, ఇతర రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు చేరిందన్నారు. దీంతో జిల్లాలో పంటల సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. దీంతో జిల్లాలో యూరియా అవసరం పెరుగుతోందని నామా తెలిపారు.

Next Story