హైదరాబాద్‌ లోని నల్లకుంట పోలీసుస్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముడిని అన్నా, వదినలు కలిసి హతమార్చడం తీవ్రకలకలం రేపింది. ఆస్తి తగాదాల విషయంలో తమ్ముడు రమేష్ (40)ను అన్న, వదినలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. హత్య అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఆస్తి తగాదాలేనా..? లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, పోర్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.