మాస్క్ ఏది.. కరోనా అంటే భయం లేదా..
By తోట వంశీ కుమార్ Published on 25 April 2020 7:31 PM ISTటాలీవుడ్ మన్మధుడు నాగార్జున, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'శివమణి'. 2003లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించారు. అయినప్పటికి ఈ లాక్‌డౌన్ రూల్స్‌ను ఉల్లంగిస్తూ కొందరు రోడ్లపైకి వస్తున్నారు. కాగా.. ఆ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తుత కరోనా పరిస్థితులకు సరిపడే డైలాగులతో ఓ నెటిజన్ స్ఫూఫ్ చేసి వీడియోను రూపొందించారు. తాజాగా ఈ వీడియోను నాగార్జున ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 'నేను ఇప్పడు శివమణి సినిమా చేస్తే కరోనా సంక్షోభంలో పూరి జగన్నాథ్ రాసే డైలాగులు ఇలా ఉంటాయి' అని ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. నాగార్జున ట్వీట్ పై స్పందించిన పూరీ.. 'వీడియో చాలా బాగుంది సార్' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.