నాగ చైత‌న్య - శేఖ‌ర్ క‌మ్ముల సినిమా టైటిల్ ఇదే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:32 AM GMT
నాగ చైత‌న్య - శేఖ‌ర్ క‌మ్ముల సినిమా టైటిల్ ఇదే

అక్కినేని నాగ చైత‌న్య-సాయి ప‌ల్ల‌వి జంట‌గా.. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

కథేంటంటే..

ఈ సినిమాలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూరు నుంచి హైద‌రాబాద్ వ‌స్తారు. హైద‌రాబాద్ లో క‌లుసుకున్న వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. అయితే.. వీళ్ల‌ద్ద‌రికి ల‌క్ష్యాలు ఉంటాయి. వాళ్ల ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో వ‌చ్చిన అడ్డంకులు ఏంటి..? చివ‌రికి ప్రేమ‌లో విజ‌యం సాధించారా..? లేదా..? అనేదే ఈ సినిమా క‌థ అని తెలిసింది. ఈ సినిమాకి ల‌వ్ స్టోరీ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఏసియ‌న్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో నాగ చైత‌న్య తెలంగాణ యాస‌లో మాట్లాడ‌తాడు. అందుకోసం శేఖ‌ర్ క‌మ్ముల ద‌గ్గ‌రే ట్రైనింగ్ తీసుకున్నాడు చైత‌న్య‌.

ప్రేమికుల రోజే రిలీజ్‌..?

సెప్టెంబ‌ర్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ.. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ కి షూటింగ్ కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం తెలియచేసింది. అందుచేత ఈ సినిమాని ప్రేమికుల రోజైన ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Next Story
Share it