యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన ‘వెంకీమామ’ త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు. చైత‌న్య ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే… చైత‌న్య‌, దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ఈ చిత్రం కొత్త ద‌ర్శ‌కుడు శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు. కానీ ఈ చిత్రం దిల్ రాజు ప‌క్క‌న పెట్టేసార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కార‌ణం ఏంటంటే… చైత‌న్య ఈ సినిమా సెకండ్‌ ఆఫ్ విష‌యంలో అసంతృప్తి వ్య‌క్తం చేశాడని సమాచారం. దీనికి తోడు ఇందులో న‌టించేందుకు హీరోయిన్ ర‌ష్మిక రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ కావాల‌ని అడిగిందని తెలుస్తోంది. అందుచేత ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టేసార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

డైరెక్ట‌ర్ శ‌శి, చైత‌న్య సూచ‌న‌ల మేర‌కు సెకండ్‌ ఆఫ్ లో మార్పులు చేస్తున్నట్లు అనుకుంటున్నారు. ఇది పూర్త‌వ్వ‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని టాలీవుడ్ టాక్‌. మ‌రి.. క‌థ‌లో మార్పులు చైత‌న్య‌ని సంతృప్తి ప‌రుస్తాయా..? ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెబుతాడా..? లేదా..? అనే క్లారిటీ రావాలంటే మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.