ఇడ్లీ.. భారత దేశంలో అందరికీ ఇష్టమైన అల్పాహారం. సామాన్యంగా మనం ఒకసారి ఎన్ని ఇడ్లీలు తినగలుగుతాం..? నాలుగో, ఆరో... అంతే కదా??

కానీ.. మంగళవారం రోజున మైసూరు దసరా ఉత్సవాల్లో జరిగిన ఇడ్లీ తినే పోటీల్లో కర్ణాటకలోని హుళ్లహళ్లి కి చెందిన 60 ఏళ్ల సరోజమ్మ మహిళ అనూహ్యంగా నిమిషానికి 6 ఇడ్లీలు తినేసింది.

ప్రతి ఏటా, పది రోజుల పాటు మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో మైసూరు నగరం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతారు. వీటిలో భాగంగానే ఇడ్లీ తినే పోటీలు చేపట్టారు. అందులో విజేతగా నిలిచింది సరోజమ్మ, ఈ వీడియో దేశమంతా వైరల్ అవుతోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story