2020లో ప్రపంచమంతా అల్లకల్లోలం
By రాణి
ముఖ్యాంశాలు
- రష్యా అధ్యకుడికి ప్రాణహాని
- వ్యాధుల బారిన పడనున్న ట్రంప్
- ఇండియా సహా ప్రపంచమంతా మతపరమైన విద్వేషాలు
2020సంవత్సరంలో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుందని, ప్రజలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తారని చెప్తోంది బాబా వెంగా భవిష్యవాణి. బల్గేరియాకు చెందిన భవిష్య వక్త బాబా వెంగా అసలు పేరు వెంగోలియా పాండేవ్. జనవరి 31వ తేదీ 1911లో జన్మించిన ఆయన 1996, ఆగస్టు 11న మృతి చెందారు. 12 ఏళ్ల వయసులోనే చూపు కోల్పోయారు. ఆ తర్వాత తనకు భగవంతుడు ముందుగానే భవిష్యత్ ను చూసే శక్తినిచ్చాడని చెప్పారు. ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో బాబా వెంగా భవిష్యవాణి ద్వారా ముందుగానే చెప్పారు.
బాబా వెంగా భవిష్యవాణి ప్రకారం 2020లో ముస్లింల గళం మరింత పెరుగుతుంది. యూరప్ లో రసాయన దాడులు ఫలితంగా యూరోపియన్ మహాద్వీపం అస్థిత్వానికి ముప్పు వస్తుందట. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రాణహాని, డొనాల్డ్ ట్రంప్ వ్యాధులబారిన పడతారని వెంగా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దుస్సంఘటనలు జరుగుతాయని, ఉపద్రవాలు సంభవిస్తాయని వెంగా భవిష్యవాణి చెప్తోంది. ప్రజల ప్రవర్తనలో మార్పులు, మతపరమైన కల్లోలాలు చెలరేగే ఆస్కారం మెండుగా ఉంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుందట. ప్రజలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించడం వల్ల సమస్యలపాలవుతారని వెంగా చెప్పిన భవిష్యవాణిలో ఉంది.
పెట్రోల్ ఉత్పత్తులు తగ్గి, సౌరశక్తి వినియోగం మరింత పెరుగుతుందట. న్యూ ఇయర్ లో రష్యా, భారత్, చైనా లు అన్ని రంగాల్లో మరింత శక్తివంతంగా రాణిస్తాయని బాబా వెంగా భవిష్యవాణిలో పేర్కొన్నారు. అలాగే 2111లో మానవులు రోబోలుగా మారుతారని, 2130లో ఏలియన్స్ భూమి మీదికి వస్తాయని చెప్పారు.