109 మంది ఉగ్రవాదులు హతం..
By Newsmeter.Network Published on 24 Dec 2019 3:04 PM IST
కాబూల్: నిత్యం ఉగ్రవాద కార్యాకలపాలతో ఆఫ్ఘాన్ దేశం అట్టుడికిపోతోంది. సరిహద్దుల్లో రోజు రోజుకు తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. బాంబు దాడులు, సాయుధ దాడులకు పాల్పడుతూ పెద్ద ఎత్తును హింసకు పాల్పడుతున్నారు. పలువురిని కిడ్నాప్ చేస్తూ భయాబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో ఉగ్రవాదులను ఎరివేతకు ఆప్ఘానిస్తాన్ ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్లు చేపట్టింది. గడిచిన 24 గంటల్లో 109 మంది ఉగ్రవాదులను హతమార్చింది. 15 ప్రావిన్స్‌లో 18 ఆపరేషన్లు చేపట్టినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. స్పెషల్ ఆపరేషన్లలో దాదాపు 45 మంది తాలిబన్లు గాయపడ్డారని సమాచారం. నాలుగు ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి ఆప్ఘాన్ ఆర్మీ.. తాలిబన్లను అదుపులోకి తీసుకుంది. కపిసా ప్రావిన్స్‌లో తొమ్మిది మంది, లఘ్‌మన్‌లో ముగ్గురు, లోగర్‌లో మరో 12 మంది తాలిబన్లు హతమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ ట్విటర్‌లో పేర్కొంది.