న్యూజిలాండ్‌లో 50 వేల తుపాకులు స్వాధీనం

By జ్యోత్స్న  Published on  22 Dec 2019 2:21 AM GMT
న్యూజిలాండ్‌లో 50 వేల తుపాకులు స్వాధీనం

ప్రజలు అడిగినప్పుడు వెంటనే తుపాకీ లైసెన్స్ ఇచ్చి అనవసరంగా సమస్యలు తెచ్చుకున్నామంటోంది న్యూజిలాండ్ ప్రభుత్వం. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన ఉగ్ర‌దాడి త‌ర్వాత ఆ దేశం ప్ర‌జ‌ల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుంటోంది. డిసెంబ‌ర్ 20 వరకు ఆ డెడ్‌లైన్ ముగిసింది. దీనితో ఇప్ప‌టి దాకా సుమారు 50 వేలకు పైగా తుపాకులను ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి అప్ప‌గించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన సెమీ ఆటోమెటిక్ ఆయుధాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయితే.. ఆయుధాల స్వాధీనం స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేద‌ని ఆరోప‌ణ‌లు వస్తున్నాయి.

అక్ర‌మంగా ఆయుధాలు క‌లిగి ఉన్న‌వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మార్చి నెలలో క్రైస్ట్‌ చ‌ర్చ్‌లోని మ‌సీదుల‌పై ఓ ఉన్మాది జ‌రిపిన కాల్పుల్లో 51 మంది మృతి చెందారు. దాంతో కివీస్ ప్ర‌భుత్వం ఆయుధాల అప్ప‌గించాల‌ని పిలుపునిచ్చింది. సుమారు 33 వేల మంది, దాదాపు 51 వేలకు పైగా గ‌న్నుల‌ను అంద‌జేశారు. వీటికి ప్రభుత్వం కొంత మొత్తాన్ని చెల్లించింది. ఇక కొందరు రికార్డులో లేకుండా ఇల్లీగల్ గా గన్స్ కలిగి ఉన్నవారు కొన్ని నిర్ణీత స్థానాలలో తమ గన్ లను వదిలిపెట్టేసారు.

50 thousand guns

Next Story