విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ పాలనపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పాలన జనరంజకంగా సాగుతోందని.. తాను వైఎస్‌ జగన్‌కు 100కు 150 మార్కులు వేస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్‌ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు తన బస్సులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు తమ ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులను సీజ్ చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్‌ చేశారని విమర్శించారు. జరిమానాలతో పోయే తప్పిదాలకు సీజ్‌ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్‌ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తమ అబ్బాయేనని జేసీ వ్యాఖ్యానించారు. పరిపాలనలో ఆయన కిందామీదా పడుతున్నారని జేసీ దివాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.