ఈ పురుగు విలువ ఎంతో తెలుసా?

మనం ఏదైనా పనికిరానిదాన్ని పురుగుతో పోలుస్తుంటాం.. కానీ ఈ పురుగు విలువ తెలిశాక ముక్కుపై వేలు వేసుకోవాల్సిందే.

By అంజి  Published on  12 Aug 2024 11:19 AM IST
Insect, stag beetle, viral

ఈ పురుగు విలువ ఎంతో తెలుసా?

మనం ఏదైనా పనికిరానిదాన్ని పురుగుతో పోలుస్తుంటాం.. కానీ ఈ పురుగు విలువ తెలిశాక ముక్కుపై వేలు వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఒక్క పురుగు ధర అక్షరాలా రూ.75 లక్షలు. ఇంత చిన్న జీవికి అంత ధర ఎందుకు అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ, ఈ పురుగు ప్రత్యేకతలు తెలిస్తే దానికి అంత ధర పెట్టొచ్చులే అనిపిస్తుంది.

ఇంతకీ ఆ కీటకం పేరు చెప్పలేదు కదా? దాని పేరు స్టాగ్‌ బీటిల్. ఇది ప్రపంచంలోనే ఖరీదైన పురుగుగా పేరుగాంచింది. దీని బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్య ఉంటుంది. ఈ పురుగుకు ఉండే కొండీలు మగ జింగ కొమ్ముల మాదిరి ఉంటాయి. అందుకే వీటికి స్టాగ్‌ బీటిల్‌ అనే పేరు వచ్చింది. ఈ కీటకాన్ని అదృష్టంగా భావిస్తారు.

అంతేకాకుండా రకరకాల ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. ఇవి చెట్ల నుంచి వచ్చే సాప్‌ అనే ద్రవాన్ని, కుళ్లిపోయిన పండ్ల నుంచి వచ్చే తీపి స్రావాలను సేవిస్తాయి. ఇవి దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జత కట్టేందుకు కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన శబ్దం చేస్తాయి.

Next Story