ఇంట్లో గుమ్మాలు, కిటికీలు ఎందుకు సరి సంఖ్యలోనే ఉండాలి?

Vastu Tips For Home. ఇంటి నిర్మించేటప్పుడు ఆ ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం సరైన పద్ధతిలో నిర్మిస్తూవుంటారు,కిటికీలు, గుమ్మాల విషయం లో తీసుకోవలసిని జాగ్రత్తలు

By Medi Samrat  Published on  3 Jan 2021 1:36 AM GMT
Vastu tips for doors and windows in Telugu

సాధారణంగా ఎవరైనా కొత్త ఇంటి నిర్మించేటప్పుడు ఆ ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం సరైన పద్ధతిలో నిర్మిస్తుంటారు. ఇల్లు కట్టుకోవడం అంటే కేవలం ఎండ, గాలి, వాన, నుంచి రక్షణ పొందడమే కాదు, ఆ ఇంట్లో నివసించే ప్రజలు ఎప్పుడు ఆనందంతో, ఆరోగ్యంతో ఉండాలని నిర్ణయించుకుంటారు.అందుకోసమే ఆ ఇంటినే నిర్మించేటప్పుడు అన్ని శాస్త్ర ప్రకారం ఆలోచించి నిర్మిస్తారు.ఇందులో భాగంగానే ఇంట్లో తలుపులు కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అని అయోమయంలో పడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణ సమయంలో కిటికీలు తలుపులు ఏవిధంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం...

ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఇంట్లోకి గాలి వెలుతురు తో పాటు మన రాకపోకలకు అనువుగా ఉండడానికి కిటికీలను, గుమ్మాలను ఎప్పుడూ కూడా సరి సంఖ్యలోనే నిర్మించుకోవాలి. మనం నిర్మించే కిటికీల సంఖ్య ఎప్పుడూ కూడా సున్నా రాకూడదు. అంటే 10,20 ఈ విధంగా కిటికీలను నిర్మించకూడదు. అలాగే బేసి సంఖ్యలో1,3,57 ఈ విధంగా కూడా ఉండకూడదని మన శాస్త్రం చెబుతోంది. కేవలం ఇంటి విషయంలో మాత్రమే ఇలాంటి సంఖ్యాశాస్త్రలను నమ్ముతున్నారు.

కానీ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన సందర్భం వివాహం అని చెప్పవచ్చు. కానీ ఆ వివాహ సమయంలో మాత్రం చేయించే కొన్ని కార్యాలు బేసి సంఖ్య లోనే ఉంటాయి. మూడు ముళ్ళు వేయడం, ఏడడుగులు నడవడం, ఒకే ఒక అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా మన శరీర భాగాలు కాళ్లు, చేతులు, కళ్లు, చెవులు ఈ విధంగా అన్నీ కూడా సరి సంఖ్యలోనే ఉంటాయి. మన శరీరంలో,జీవితానికి సంబంధించినటువంటి ఇలాంటి వాటిలో తేడాలు ఉన్నప్పుడు కేవలం మనం నిర్మించుకొనే ఇంటికి మాత్రం కిటికీలు, గుమ్మాలు సరి సంఖ్యలోనే ఉండాలని ఎందుకు చెబుతుంటారంటే, ఆ ఇంటిలో నివసించే వారు గాలితో పాటు, సూర్యరశ్మిని పొందటంలో సమతుల్యం లోపించకుండా ఉండడం కోసం కిటికీలు గుమ్మాలను సరి సంఖ్యలోనే ఉండాలని వాస్తు శాస్త్రంతో పాటు, సైన్స్ కూడా చెబుతోంది.


Next Story