డిజిటల్ మీడియా.. కొత్త చట్టం యొక్క నియమాలు తెలుసుకోండి..
New digital rules.ప్రతి ఒక్కరి జీవితంలోనూ సర్వ సాధారణమై పోయాయి. వీటి ద్వారా పౌరులు ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటారు.
By M.S.R Published on 28 May 2021 2:41 PM ISTఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యత ఏమిటి, నియామాలు 2021
డిజిటల్ మీడియా అన్నది ఇటీవలి కాలంలో ఎన్నో విధాలుగా రూపాంతరం చెందింది. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సర్వ సాధారణమై పోయాయి. వీటి ద్వారా పౌరులు ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. కొన్ని విషయాలు పిల్లలకు నేరుగా కంటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భావ ప్రకటనా స్వేచ్ఛ కింద కొందరు హానికరమైన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉన్నారు. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నియమాల కారణంగా స్థిరమైన మరియు దీర్ఘకాలిక అభివృద్ధి భారతదేశ మీడియా రంగంలో చోటు చేసుకుంటుంది. వినోద రంగం డిజిటల్ మీడియాలో న్యూస్ మీడియా పర్సన్లకు ఎన్నో అవకాశాలు కూడా లభిస్తాయి. పలు మీడియా సంస్థలకు సరైన గుర్తింపు కూడా లభించనుంది.
ఈ నియమాలను నేను ఎక్కడ సమగ్రంగా చదవగలను?
మినిస్ట్రీకు చెందిన అధికారిక వెబ్సైట్ లో వీటిని చదవొచ్చు
సెక్షన్ 2: Basic Terminology and Scope of the Rules
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి ఏయే అంశాలు వస్తాయి (Intermediary Guidelines and Digital Media Ethics Code) నియమాలు, 2021?ఈ నియమాలు వార్తలు, కరెంట్ అఫైర్స్ లను పబ్లిష్ చేసే మీడియా సంస్థలకే కాకుండా ఓటీటీ సంస్థలకు, మధ్యవర్తులకు కూడా వర్తిస్తుంది.
డిజిటల్ మీడియాకు చెందిన ఎవరు వార్తలను, కరెంట్ అఫైర్స్ ను పబ్లిష్ చేయొచ్చు?
ఆన్ లైన్ పోర్టల్, న్యూస్ పోర్టల్, వార్తలను సేకరించే వారు, వార్తా ఏజెన్సీలు.. మొదలైన వారే కాకుండా వార్తలను, కరెంట్ అఫైర్స్ ను పబ్లిష్ చేస్తూ ఉండే వాళ్ళు. మిగిలిన రంగాలకు చెంది ఉండి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అందించే వారు కూడా ఈ కోవకే వస్తారు.
డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు నీతి నియమాలకు సంబంధించిన సమాచారం
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
https://presscouncil.nic.in/WriteReadData/Pdf/NORMSTWOZEROONEININE.pdf
ప్రోగ్రామ్ కోడ్ సెక్షన్ 5, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్, 1995 కింద
https://www.mib.gov.in/broadcasting/programme-and-advertising-codes
ఏదైనా చట్టం అమలులో ఉంటే దాని ప్రకారం నిషేధించబడిన కంటెంట్ ప్రచురించబడదు లేదా ప్రసారం చేయబడదు.
కొత్త కోడ్ ఆఫ్ ఎథిక్స్ కారణంగా వార్తల విషయంలో ప్రచురణకర్తలకు పరిమితులు వర్తిస్తాయా..?
డిజిటల్ న్యూస్ ప్రచురణకర్తలు ఇప్పటికే ఉన్న చట్టాలను అనుసరించనున్నారు. ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకుని రాలేదు. ప్రింట్ మీడియాకు సంబంధించిన నియమాలనే ఇప్పటికే చాలా న్యూస్ వెబ్ సైట్స్, టీవీ ఛానల్స్ అనుసరిస్తూ ఉన్నాయి. ఎవరైతే డిజిటల్ వార్తల ప్రచురణ కర్తలు జర్నలిజం నిబంధనలను అనుసరించకుండా ఉన్నారో వారు (టీవీ రంగం) కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేటరీ యాక్ట్ ను ఫాలో అవ్వాల్సి ఉంది. ఇలా చేయడం వలన మీడియా సంస్థలకు ఓ స్థాయి అన్నది ఏర్పడుతుంది.
డిజిటల్ మీడియాలో ప్రజల సమస్యలను తెలియజేయడానికి ఉంచిన మూడు స్థాయిలు
ప్రజల సమస్యలను సమయానుసారంగా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మూడు స్థాయిల్లో ఉంటాయి.
మొదటి స్థాయి - ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ
రెండో స్థాయి - స్వీయ-నియంత్రణ సంస్థల ద్వారా ప్రచురణకర్తలను నియంత్రించడం
మూడో స్థాయి - కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణా విధానం
ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ విధానంలో ఎటువంటి స్వేచ్ఛ ఉంటుంది? యంత్రాంగాన్ని ప్రభుత్వం నియంత్రిస్తోందా..?
సంస్థాగత విధానం రెండు స్వీయ నియంత్రణ స్థాయిల్లో ఉంటుంది.
మొదటి స్థాయి - తామే ప్రచురణ కర్తలుగా ఉండడం
రెండో స్థాయి- స్వీయ నియంత్రణ పాటించే విభాగంగా ఉండడం
స్వీయ నియంత్రణ పాటించే విభాగంగా సంస్థ కొందరిని నియమించుకోవచ్చు. పబ్లిషర్లే స్వీయ నియంత్రణ పాటించే వారుగా ఉండొచ్చు. సుప్రీం కోర్టు/ హై కోర్టుకు చెందిన ప్రముఖ వ్యక్తిని నియంత్రించే విభాగానికి అధిపతిగా ఉంచొచ్చు లేదా ప్రముఖ వ్యక్తిని చైర్ పర్సన్ గా ఉంచొచ్చు.. ఇలా చేయడం వలన మంచి గుర్తింపు పేరు కూడా లభించే అవకాశం ఉంది. మొదటి రెండు స్థాయిల ద్వారా పరిష్కరించలేని వాటిని మూడో స్థాయి ద్వారా ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉంది.
మొదటి స్థాయిలో ఉన్న పబ్లిషర్ సమస్యలను ఎలా పరిష్కరించాల్సి ఉంటుంది?
సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి.. అందులో ఓ అధికారిని నియమించాలి. అది కూడా భారతీయుడై ఉండాలి. సమస్యలను నిర్ణీత కాలంలో పరిష్కరిస్తూ ఉండాలి. వెబ్సైట్ లేదా ఇంటర్ఫేస్ లో పరిష్కరించబడిన సమస్యలకు సంబంధించిన సమాచారం పొందుపరుస్తూ ఉండాలి. ప్రతి ఒక్క ప్రచురణకర్త స్వీయ నియంత్రణ బృందంలో సభ్యునిగా ఉండాలి.
సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది..?
15 రోజులలో వినియోగదారులు సమస్యలను పబ్లిషర్లు పరిష్కరించాల్సి ఉంటుంది.
ప్రచురణకర్త తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిర్యాదుదారులు అప్పీల్ చేయగలరా?
చేయవచ్చు, ప్రచురణ కర్త స్వీయ నియంత్రణ సంస్థలో సభ్యుడైనప్పటికీ అతడికి వ్యతిరేకంగా ఫిర్యాదుదారు అప్పీల్ చేయవచ్చు. అలాంటి విజ్ఞప్తి అందుకున్న 15 రోజుల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
15 రోజుల్లో ప్రచురణకర్త స్పందించకపోతే ఏమి జరుగుతుంది..?
15 రోజుల్లో ప్రచురణకర్త స్పందించకపోతే.. ఫిర్యాదు దారుడి సమస్య నేరుగా స్వీయ నియంత్రణ బృందం దగ్గరకి వెళుతుంది. వారు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫిర్యాదు / సమస్య ఎలా పరిష్కరించబడుతుంది
కమిటీ అన్నది మినిస్ట్రీకి కొన్ని సూచనలు చేస్తుంది
హెచ్చరిక, ఉపదేశించడం లేదా మందలించడం వంటివి చేస్తుంది.
కొన్ని సార్లు క్షమాపణలు చెప్పాలని కోరుతుంది
కొన్ని విషయాల్లో హెచ్చరిక లేదా సంబంధం లేదు అనేలా
ఆన్‌లైన్ కంటెంట్ విషయంలో ప్రచురణకర్తకు దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది:
సంబంధిత కంటెంట్ యొక్క రేటింగ్‌లను తిరిగి వర్గీకరించాలి
సంబంధిత కంటెంట్ యొక్క సారాంశాన్ని సవరించండి
కంటెంట్ డిస్క్రిప్షన్ లో తగిన మార్పు చేయండి.. వయస్సు వర్గీకరణ, తల్లిదండ్రుల చేతుల్లో నియంత్రణ మొదలైనవి
ప్రజల మనోభావాలను దెబ్బ తీసే కంటెంట్ ను తీసి వేయాలి. ఇతరులను ప్రేరేపించే విధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించండి లేదా సవరించాలి.
కంటెంట్ విషయంలో కమిటీ సంతృప్తి చెందకపోతే సెక్షన్ 69A లోని ఉప విభాగం (1) లో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేయవచ్చు.
ప్రచురణకర్తలు, మధ్యవర్తులు పబ్లిక్ డొమైన్‌లో ఏయే అంశాలు ఉంచాలంటే?
ప్రచురణకర్తలు మరియు స్వీయ-నియంత్రణ సంస్థలు వారు అందుకున్న ఫిర్యాదులను, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ఫిర్యాదుదారునికి సమాధానం పంపిస్తూ ఉండాలి. ఇది ప్రతి నెలా జరిగేలా ఉండాలి. సమాచారం తెలుస్తూ ఉండాలి.