నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆకాశం నుంచి నేల రాలే ఉల్కా పాతాలను ప్రజలు నేరుగా చూడవచ్చని ప్లానెటరీ సోసైటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

By అంజి
Published on : 16 Dec 2023 7:20 AM IST

Meteors, sky, phaethon, Planetary Society of India

నేటి నుంచి 5 రోజుల పాటు ఆకాశంలో అద్భుతం

నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఆకాశం నుంచి నేల రాలే ఉల్కా పాతాలను ప్రజలు నేరుగా చూడవచ్చని ప్లానెటరీ సోసైటీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌ అధికారి రఘునందన్‌ తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వేరు వేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపిస్తాయన్నారు. పాథియాన్‌ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో కొద్ది నెలల కిందట దారి తప్పి భూ కక్ష్యలోకి ప్రవేశించిందని.. ఇతర పదార్థాలతో రాపిడికి గురై ఉల్కలుగా పడుతుందన్నారు.

ఉల్కలు నేల రాలే సమయంలో గంటకు 150 కాంతిపుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ పేర్కొంది. గ్రామాలతో పాటు.. పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాటిని చూసిన వారు ఫొటోలు, వీడియోలు తీసి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని పేర్కొంది. పూణేకు చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ నేషనల్ ఔట్‌రీచ్ కోఆర్డినేటర్ సమీర్ ధుర్డే మాట్లాడుతూ.. తమ భవనం టెర్రస్‌పై పడుకుని రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే ఉల్కాపాతం కనిపిస్తుందని అన్నారు.

Next Story