ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే

అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సపమాచారం సేకరించి, హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది.

By అంజి  Published on  28 July 2024 10:45 AM GMT
powerful passports, world, Henley Passport Index, passport

ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే

అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సపమాచారం సేకరించి, హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చని నివేదిక తెలిపింది. ఇక రెండో స్థానాన్ని ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, జపాన్‌ సంయుక్తంగా పంచుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు.

ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌, ఐర్లాండ్‌, లగ్జెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ పాస్‌పోర్టులు మూడో స్థానం దక్కించుకున్నాయి. వీటితో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఇక భారతదేశం విషయానికొస్తే 82వ స్థానం దక్కించుకుంది. గతంలో 85వ స్థానంలో ఉండగా ఈసారి మూడు స్థానాలు మెరుగుపర్చుకుంది. మన పాస్‌పోర్ట్‌తో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ ర్యాంక్‌ని సెనెగెల్‌, తజకిస్తాన్‌ దేశాలతో కలిసి భారత్‌ పంచుకుంది.

Next Story